Story1

Title: కుందేలు మరియు తాబేలు

Grade 0+ Lesson s3-l4

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1.1 Picture: కుందేలు మరియు తాబేలు -→ Hare and Tortoise

Test

Description:

Location: అడవి

Forest

Characters: కుందేలు మరియు తాబేలు

Hare and Tortoise

Items: చెట్లు, ఇళ్ళు, సరస్సు మరియు వంతెన

Trees, houses, lake, and a bridge

Action: తాబేలును ఎగతాళి చేస్తున్న కుందేలు

A hare making fun of the tortoise

Sentences:

అనగనగా ఒక ఊరికి దగ్గరలో, ఒక కుందేలు మరియు తాబేలు నివసించేవి.

అవి రెండూ మంచి స్నేహితులు, కానీ కుందేలు తన వేగాన్ని చూసి చాలా గర్వపడేది.

తాబేలు నెమ్మదిగా ఉండటం వల్ల దానిని కుందేలు తరచుగా ఆటపట్టిస్తూ ఉండేది.

Translation:

Anaganaga oka uriki daggaralo, oka kundelu mariyu tabelu nivasinchevi.

Avi rendu manchi snehithulu, kani kundelu tana veganni chusi chala garvapadedi.

Tabelu nemmadiga undatam valla danini kundelu tarachuga atapattisthu undedi.

English:

Once upon a time, a hare and a tortoise lived near a village.

They were good friends, but the hare was very proud of his speed.

He often teased the tortoise for being slow.

1.2 Picture: సవాలు -→ The Challenge

Test

Description:

Location: అడవి

Forest

Characters: కుందేలు మరియు తాబేలు

Hare and Tortoise

Items: చెట్లు, పొదలు మరియు రాళ్ళు

Trees, bushes, and stones

Action: కుందేలును సవాలు చేస్తున్న తాబేలు

A tortoise challenging the hare

Sentences:

కుందేలు అలా ఆటపట్టించడంతో తాబేలు చాలా విసిగిపోయింది.

ఒకరోజు, అది కుందేలును పరుగు పందెం కు సవాలు చేసింది.

కుందేలు అది విని నవ్వింది కానీ, వెంటనే పరుగు పందెంకు అంగీకరించింది.

Translation:

Kundelu ala aatapattinchadamtho tabelu chala visigipoyindi.

Okaroju, adi kundelunu parugu pandem ku savalu chesindi.

Kundelu adi vini navvindi kani, ventane parugu pandemku angikarinchindi.

English:

The tortoise was tired of the hare’s teasing.

One day, he challenged the hare to a race.

The hare laughed but quickly agreed to the race.

1.3 Picture: ఏర్పాటు చేసిన పరుగు పందెం -→ The Race is Set

Test

Description:

Location: అడవి

Forest

Characters: కాకి, ఏనుగు, తాబేలు, కప్ప, పిల్లి, కుందేలు, కోతి మొదలైనవి

Crow, Elephant, Tortoise, Frog, Cat, Hare, Monkey, etc.

Items: ఒక చెట్టు, గడ్డి, రాళ్ళు మరియు పుట్టగొడుగులు

A tree, grass, stones, and mushrooms

Action: జంతువులు పరుగు పందెం ఏర్పాటు చేస్తున్నాయి

Animals planning race

Sentences:

ఆ పరుగు పందెం మరుసటి రోజు జరగాలని అనుకున్నాయి.

అడవిలోని జంతువులన్నీ ఆ పందెం చూడటానికి గుమిగూడాయి.

వాటిలో కాకిని న్యాయనిర్ణేతగా ఎంపిక చేశాయి.

Translation:

A parugu pandem marusati roju jaragalani anukunnayi.

Adaviloni janthuvulanni a pandem chudataniki gumigudayi.

Vatilo kakini nyayanirnethaga empika chesayi.

English:

The race was planned for the next day.

All the forest animals gathered to watch the race.

The crow was chosen to be the judge.

1.4 Picture: ప్రారంభం అయిన పందెం -→ The Start of the Race

Test

Description:

Location: అడవి

Forest

Characters: కోతి, నక్క, కప్ప, ఏనుగు, జింక, తాబేలు, కుందేలు, ఎలుక, కాకి, మొదలైనవి

Monkey, Fox, Frog, Elephant, Deer, Tortoise, Hare, Mouse, Crow, etc.

Items: చెట్లు, ట్రాక్ మరియు గడ్డి

Trees, track, and grass

Action: పందెం మొదలవుతోంది

A race about to start

Sentences:

కుందేలు మరియు తాబేలు పందెం మొదలయ్యే గీత వద్ద నిలబడి ఉన్నాయి.

జంతువులు వాటి కోసం పెద్దగా అరుస్తూ ఉత్సాహపరుస్తున్నాయి.

మీ గీత వద్ద సిద్ధంగా ఉండండి, వెళ్ళండి!” అని కాకి అరిచింది.

Translation:

Kundelu mariyu tabelu pandem modalayye gita vadda nilabadi unnayi.

Janthuvulu vati kosam peddaga arustu utsahaparustunnayi.

Mi gita vadda siddhamga undandi, vellandi!” Ani kaki arichindi.

English:

The hare and the tortoise stood at the starting line.

The animals cheered loudly for them.

“On your mark, get set, go!” shouted the crow.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 13-June-2025 12:00PM EST