Story2

Title: పావురాలు & ఎలుకలు

Grade 0+ Lesson s1-l3

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

2.1 Picture: వలలో చిక్కుకున్న పావురాలు -→ Caught in the Net

Test

Description:

Location: అడవి

Forest

Characters: పావురాలు మరియు వేటగాడు

Doves and a hunter

Items: చెట్లు, పొదలు, వల మరియు ధాన్యపు గింజలు

Trees, bushes, net, and grains

Action: వేటగాడు వల లాగుతున్నాడు

A hunter pulling the net

Sentences:

పావురాలు తినే పనిలో నిమగ్నమై ఉండడంతో, వేటగాడు వలను పట్టుకొని లాగాడు.

వెంటనే పావురాలన్నీ ఆ వలలో చిక్కుకున్నాయి.

దానితో అవి చాలా భయపడ్డాయి.

Translation:

Pāvurālu tinē panilō nimagnamai uṇḍaḍantō, vēṭagāḍu valanu paṭṭukoni lāgāḍu.

Veṇṭanē pāvurālannī ā valalō chikkukunnāyi.

Dānitō avi chālā bhayapaḍḍāyi.

English:

As the doves were busy eating, the hunter pulled the net.

All the doves were caught in it.

They were shocked and scared.

2.2 Picture: ఒక తెలివైన ఆలోచన -→ A Clever Plan

Test

Description:

Location: అడవి

Forest

Characters: పావురాలు

Doves

Items: చెట్లు, పొదలు, వల మరియు ధాన్యపు గింజలు

Trees, bushes, net, and grains

Action: పావురాలు వలలో చిక్కుకున్నాయి

Doves caught in a net

Sentences:

రాజు పావురం భయపడవద్దని మిగిలిన పావురాలతో చెప్పింది.

అందరమూ కలిసి ప్రయత్నం చేస్తే మనం తప్పించుకోవచ్చని చెప్పింది.

అలా తన తెలివైన ఆలోచనను అన్ని పావురాలతో చెప్పింది.

Translation:

Rāju pāvuraṁ bhayapaḍavaddani migilina pāvurālatō cheppindi.

Andaramū kalisi prayatnaṁ chēstē manaṁ tappin̄chukōvacchani cheppindi.

Alaa tana telivaina ālōchananu anni pāvurālatō cheppindi.

English:

The king of the doves asked his flock not to panic.

He told them they could escape if they worked together.

He shared his clever plan with them.

2.3 Picture: కలిసి ఎగురుట -→ Flying Together

Test

Description:

Location: అడవి

Forest

Characters: పావురాలు

Doves

Items: చెట్లు, పొదలు, వల, రాళ్ళు

Trees, bushes, net, rocks

Action: వలతో పాటుగా ఎగురుతున్న పావురాలు

Doves flying with the net

Sentences:

రాజు పావురం, తను మూడంకెలు లెక్కపెట్టగానే అందరినీ కలిసి ఒక్కసారిగా ఎగరమని చెప్పింది.

మన అందరి శక్తి కలిపితే, వలను పైకి లేపటానికి సహాయపడుతుంది అని వివరించింది.

పావురాలు అన్నీ రాజు సూచనలను శ్రద్ధగా విన్నాయి.

Translation:

Rāju pāvuraṁ, tanu mūḍaṅkelu lekkapeṭṭagānē andarinī kalisi okkasārigā egaramani cheppindi.

Mana andari śakti kalipitē, valanu paiki lēpaṭāniki sahāyapaḍutundi ani vivarin̄chindi.

Pāvurālu annī rāju sūchanalanu śrad’dhagā vinnāyi.

English:

The king told the flock to fly together on his count of three.

He explained that their combined strength would help lift the net.

The doves listened carefully to his instructions.

2.4 Picture: గొప్పగా తప్పించుకున్నాయి -→ The Great Escape

Test

Description:

Location: అడవి

Forest

Characters: పావురాలు, వేటగాడు

Doves, hunter

Items: చెట్లు, పొదలు మరియు వల

Trees, bushes, and a net

Action: వేటగాడు వలతో పాటుగా ఎగురుతున్న పావురాలను చూసి ఆశ్చర్యపోతున్నాడు

A surprised hunter watching the flock of doves with net

Sentences:

మూడు అంకెలు లెక్కపెట్టగానే, పావురాలన్నీ కలిసి ఒకేసారి రెక్కలు విప్పి ఎగిరాయి.

అవి అన్నీ కలిసి వలను గాలిలోకి ఎత్తగలిగాయి.

అవి తప్పించుకోవడం చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు.

Translation:

Mūḍu aṅkelu lekkapeṭṭagānē, pāvurālannī kalisi okēsāri rekkalu vippi egirāyi.

Avi annī kalisi valanu gālilōki ettagaligāyi.

Avi tappin̄chukōvaḍaṁ chūsi vēṭagāḍu āścharyapōyāḍu.

English:

On the count of three, all the doves flapped their wings together.

They lifted the net into the air.

The hunter was surprised to see them escape.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST