Story1

Title: దాహంతో ఉన్న కాకి

Grade 0+ Lesson s1-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1.1 Picture: కాకి యొక్క పరిచయం -→ Introduction of crow

Test

Description:

Location: అడవి

Forest

Characters: కాకి

Crow

Items: సూర్యుడు, పొదలు, చెట్టు, గడ్డి, పుట్టగొడుగులు, మేఘాలు, రాళ్లు

Sun, bushes, tree, grass, mushrooms, clouds, and stones

Action: చెట్టుపై ఒక కాకి ఉంది

A crow on the tree

Sentences:

అనగనగా ఒక కాకి ఒక అడవిలో నివసించేది.

అది తెలివైన కాకిగా పేరు పొందింది.

అది ఆకాశంలో ఎగురుతూ ఆనందంగా జీవించేది.

Translation:

Anaganagā oka kāki oka aḍavilō nivasin̄chēdi.

Adi telivaina kākigā pēru pondindi.

Adi ākāśanlō egurutū ānandaṅgā jīvin̄chēdi.

English:

Once upon a time, a crow lived in a forest.

He was known for being wise and strong.

He enjoyed flying high in the sky.

1.2 Picture: ఎగురుతున్న కాకి -→ Wandering crow

Test

Description:

Location: అడవి

Forest

Characters: కాకి

Crow

Items: సూర్యుడు, పొదలు, చెట్టు, గడ్డి, పుట్టగొడుగులు, మేఘాలు, రాళ్లు

Sun, bushes, tree, grass, mushrooms, clouds, and stones

Action: నీరు వెతుకుతున్న ఒక కాకి

A crow searching for water

Sentences:

ఎండ ఎక్కువగా ఉన్న ఒక రోజున, ఎగురుతుండగా, కాకికి దాహం వేసింది.

అది ఎగురుతూ త్రాగడానికి నీళ్ల కోసం వెతికింది.

అలా నీరు దొరికే ప్రదేశం కోసం వెదుకుతూఉంది.

Translation:

Eṇḍa ekkuvagā unna oka rōjuna, egurutuṇḍagā, kākiki dāhaṁ vēsindi.

Adi egurutjuu trāgaḍāniki nīḷla kōsaṁ vetikindi.

Alaa nīru dorikē pradēśaṁ kōsaṁ vedukutū undi.

English:

On a sunny day, while flying, the crow felt thirsty.

He flew and searched for water to drink.

His thirst made him determined to find a water source.

1.3 Picture: ఆశ కోల్పోవడం -→ Loss of hope

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

Crow

Items: చెట్లు, పొదలు, గడ్డి, మేఘాలు, ఇళ్లు, రాళ్లు, సూర్యుడు

Trees, bushes, grass, clouds, houses, fence, rocks and Sun

Action: కాకి ఇళ్లపైనుండి ఎగురుతూ వెళ్తుంది

The crow over many houses

Sentences:

కాకి నీళ్ళ కోసం చాలా ఇళ్ల మీదుగా ఎగిరింది.

కొంచెం నీళ్ళు దొరుకుతాయనే ఆశతో వెతుకుతుంది, కానీ నీళ్లు కనిపించలేదు.

ఎంత వెతికినా తాగడానికి ఒక్క చుక్క కూడా దొరకలేదు.

Translation:

Kāki nīḷḷa kōsaṁ chālā iḷla mīdugā egirindi.

Kon̄cHeṁ nīḷḷu dorukutāyanē āśatō vethukuthundi, kānī nīḷlu kanipin̄chalēdu.

Entha vetikinā tāgaḍāniki okka chukka kūḍā dorakalēdu.

English:

The crow flew over many houses, looking for water.

He hoped to find some, but no water was in sight.

Even after searching , he could not find a drop to drink.

1.4 Picture: కాకి ఒక కుండను కనుగొంది -→ Crow find a pot

Test

Description:

Location: గ్రామం

Village

Characters: కాకి

Crow

Items: చెట్లు, కొండలు, పొదలు, రాళ్లు, సూర్యుడు, నీరు, ఒక ఇల్లు, ఒక కుండ

Trees, mountains, bushes, pebbles, sun, water, a house, and a pot

Action: కాకి ఉత్సాహంగా కుండ వైపు చూస్తోంది

The crow excitedly looking at the pot

Sentences:

అలా వెతుకుతూ ఉండగా, కాకి ఒక ఇంటి దగ్గర ఒక కుండను గమనించింది.

ఆ కుండను చూసి అది చాలా సంతోషించింది.

ఉత్సాహంతో, దానిని దగ్గరగా చూడటానికి కిందకు ఎగిరింది.

Translation:

Alā vetukutū uṇḍagā, kāki oka iṇṭi daggara oka kuṇḍanu gamanin̄chindi.

Ā kuṇḍanu chūsi adi chālā santōṣhin̄chindi.

Utsāhantō, daanini daggaragā cūḍaṭāniki kindaku egirindi.

English:

As he continued his search, the crow noticed a pot near a house.

He was happy to see the pot.

Excited, he flew down to take a closer look.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 19-June-2025 12:00PM EST