Story1

Title: నక్క మరియు కొంగ

Grade 0+ Lesson s3-l3

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1.1 Picture: నక్క మరియు కొంగ -→ Fox and Stork

Test

Description:

Location: అడవి

Forest

Characters: నక్క మరియు కొంగ

Fox and Stork

Items: గడ్డి, చెట్లు, మరియు పుట్టగొడుగులు

Grass, Trees, and Mushrooms

Action: నక్క మరియు కొంగ సంతోషంగా జీవిస్తున్నాయి

Fox and Stork living their life happily

Sentences:

అనగనగా ఒక అడవిలో ఒక నక్క, కొంగ అనే రెండు జంతువులు మంచి స్నేహితులుగా ఉండేవి.

వాటిలో కొంగ దయ మరియు సహనం కలిగి ఉండేది, నక్క గర్వం మరియు అసూయతో ఉండేది.

వాటి మధ్య తేడాలు ఉన్నప్పటికీ, అవి కలిసి సమయాన్ని గడుపుతూ, కథలు చెప్పుకుంటూ మరియు నవ్వుకుంటూ ఆనందంగా ఉండేవి.

Translation:

Anaganagā oka aḍavilō oka nakka, koṅga anē reṇḍu jantuvulu man̄chi snēhitulugā uṇḍēvi.

Vaatilo konga daya mariyu sahanam kaligi undedi, nakka garvam mariyu asooyatho undedi.

Vaati madhya thedalu unnappatikini, avi kalisi samayanni gadupuṭhu, kathalu cheppukuntu mariyu navvukuntu anandamga undevi.

English:

Once upon a time, there were two friends, a fox and a stork.

Ms Stork was kind and patient, while Mr Fox was proud and jealous.

Even though they were different, they liked spending time together, sharing stories, and laughing.

1.2 Picture: కొంగ యొక్క స్నేహపూర్వక స్వభావం -→ Ms.Stork’s friendly nature

Test

Description:

Location: అడవి

Forest

Characters: కొంగ, ఉడుత, గుడ్లగూబ, కుందేలు, చిలుక, పిల్లి, ఆవు, మరియు పిచ్చుక

Stork, Squirrel, Owl, Rabbit, Parrot, Cat, Cow, and Sparrow

Items: చెట్లు, పొదలు, రాళ్లు, ఆహారం మరియు పుట్టగొడుగులు

Tree, bushes, stones, food and mushrooms

Action: కొంగ అన్ని జంతువులకు ఆహారం వడ్డిస్తుంది

Stork serving food to all animals

Sentences:

అడవిలోని జంతువులన్నీ కొంగను ఎంతో ప్రేమించేవి.

అది తరచుగా రుచికరమైన భోజనం వండి, దానిని తనతో తినడానికి ఇతర జంతువులను పిలుస్తూ ఉండేది.

కొంగ మంచితనం మరియు అది బాగా వంట చేయడం వలన అందరూ దానిని మెచ్చుకొనేవారు.

Translation:

Adaviloni janthuvulanni konganu ento preminchevi.

Adi tarachuga ruchikaramaina bhojanam vandi, danini tanato tinadaniki itara janthuvulanu pilustu undedi.

Konga manchitanam mariyu adi baga vanta cheyadam valana andaru danini mecchukonevaru.

English:

All the animals in the forest loved Ms. Stork.

She often made tasty food and invited her neighbors to eat with her.

Everyone liked her for her kindness and great cooking skills.

1.3 Picture: నక్క యొక్క ఆతృత -→ Curious Fox

Test

Description:

Location: అడవి

Forest

Characters: గుడ్లగూబ, కుందేలు, పిచ్చుక, ఆవు మరియు నక్క

Owl, Rabbit,Sparrow,Cow & Fox

Items: చెట్లు, పొదలు, రాళ్లు మరియు పుట్టగొడుగులు

Trees, bushes, stones and mushrooms

Action: నక్క చాటుగా జంతువులను గమనిస్తోంది

A fox secretly watching the animals

Sentences:

ఒక రోజు ఒక గుడ్లగూబ, ఒక కుందేలు, ఒక ఆవు, ఒక పిల్లి మరియు పిచ్చుక అంతా కలిసి, కొంగ ఇంటి నుండి బయటికి రావడం నక్క చూసింది.

అవి అన్నీ కొంగ ఇంట్లో భోజనం చేసి, చాలా సంతోషంగా వస్తున్నట్లు కనిపించాయి.

అది చూసి, కొంగ వాటికి ఏమి వడ్డించిందనే దానిపై నక్కకు చాలా ఆతృతగా అనిపించింది.

Translation:

Oka roju oka gudlaguba, oka kundelu, oka avu, oka pilli mariyu pichchuka anta kalisi, konga inti nundi bayatiki ravadam nakka chusindi.

Avi anni konga intlo bhojanam chesi, chala santhoshamga vastunnatlu kanipinchayi.

Adi chusi, konga vatiki emi vaddinchindane danipai nakkaku chala athr̥uthaga anipinchindi.

English:

One day, Mr.Fox saw animals like an owl, a rabbit, a cow, a cat, and a sparrow leaving Ms Stork’s house.

They looked very happy after a big meal.

Mr.Fox became curious about what Ms.Stork had served them.

1.4 Picture: అసూయ పడుతున్న నక్క -→ Jealous Fox

Test

Description:

Location: అడవి

Forest

Characters: నక్క, కొంగ

Fox, Stork

Items: చెట్లు, మొక్కలు, మరియు పొదలు

Trees, plants, and bushes

Action: నక్క ఒక పధకాన్ని ఆలోచిస్తోంది

A fox thinking about a plan

Sentences:

కొంగ వంటని అందరూ మెచ్చుకుంటున్నందుకు నక్క చాలా అసూయ పడింది.

కొంగ కంటే తానే గొప్పదని భావించి, కొంగకు గుణపాఠం చెప్పాలని అనుకున్నది.

ఒక పధకాన్ని ఆలోచించుకొని, కొంగని తన ఇంటికి భోజనానికి పిలవాలని నిర్ణయించుకున్నది.

Translation:

Konga vantani andaru mechchukuntunnanduku nakka chala asuya padindi.

Konga kante thane goppadani bhavinchi, kongaku gunapatham cheppalani anukunnadi.

Oka padhakanni alochinchukoni, kongani tana intiki bhojananiki pilavalani nirnayinchukunnadi.

English:

Mr.Fox felt jealous because everyone praised Ms.Stork’s cooking.

He thought he was better than her and wanted to teach her a lesson.

So, he decided to invite her to dinner with a tricky plan.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 13-June-2025 12:00PM EST