Story1

Title: కోతి మరియు రెండు పిల్లులు

Grade 0+ Lesson s3-l2

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

1.1 Picture: రెండు చిన్న పిల్లులు -→ Two little cats

Test

Description:

Location: అడవి

Forest

Characters: నలుపు పిల్లి, తెలుపు పిల్లి

Black cat, white cat

Items: చెట్లు, రాళ్లు

Trees, rocks

Action: సంతోషంగా ఆడుతున్న నలుపు పిల్లి మరియు తెలుపు పిల్లి

Happily playing black cat and white cat

Sentences:

ఒకప్పుడు ఒక అడవిలో రెండు పిల్లులు నివసించేవి.

ఒక పిల్లి నలుపు మరియు మరొక పిల్లి తెలుపు రంగులలో ఉండేవి.

అవి రోజూ కలిసి ఆడుకుంటూ, తింటూ ప్రాణ స్నేహితులుగా ఉండేవి.

Translation:

Okappudu oka adavilo rendu pillulu nivasinchevi.

Oka pilli nalupu mariyu maroka pilli thelupu rangulalo undevi.

Avi roju kalisi adukuntu, thintu prana snehithuluga undevi.

English:

Once upon a time, two cats lived in a forest.

One cat was black, and the other was white.

They were best friends who played and ate together every day.

1.2 Picture: ఆహారం కోసం వెతుకుట -→ Looking for Food

Test

Description:

Location: అడవి

Forest

Characters: నలుపు పిల్లి, తెలుపు పిల్లి

Black cat, white cat

Items: చెట్లు, పొదలు, మరియు రాళ్లు

Trees, bushes, and rocks

Action: ఆహారం కోసం వెతుకుతున్న రెండు పిల్లులు

Two cats searching for food

Sentences:

ఒకరోజు, ఆ రెండు పిల్లులు ఆహారం కోసం బయటికి వెళ్లాయి.

అవి ఎన్ని చోట్ల వెతికినా వాటికి తినడానికి ఏమీ దొరకలేదు.

నలుపు మరియు తెలుపు పిల్లులు రెండూ చాలా ఆకలితో ఉన్నాయి.

Translation:

Okaroju, Aa rendu pillulu aharam kosam bayatiki vellayi.

Avi enni chotla vetikina vatiki tinadaniki emi dorakaledu.

Nalupu mariyu telupu pillulu rendu chala akalito unnayi.

English:

One day, the two cats went out to look for food.

They searched everywhere but couldn’t find anything to eat.

Both the black and white cats were very hungry.

1.3 Picture: కొత్త ఆలోచన -→ A New Idea

Test

Description:

Location: అడవి

Forest

Characters: నలుపు పిల్లి, తెలుపు పిల్లి

Black cat, white cat

Items: చెట్లు, మొక్కలు

Trees, plants

Action: ఒక గ్రామం గురించి ఆలోచిస్తున్న తెల్ల పిల్లి

A white cat thinking about the image

Sentences:

తెలుపు రంగు పిల్లికి ఒక ఆలోచన వచ్చింది.

ఆహారం వెతకడం కోసం గ్రామానికి వెళ్దాం" అని అది సూచించింది.

నల్ల పిల్లి దానికి అంగీకరించింది, అప్పుడు అవి రెండూ కలిసి గ్రామానికి వెళ్ళాయి.

Translation:

Thelupu rangu pilliki oka alochana vacchindi.

Aharam vethakadam kosam gramaniki veldam" ani adi suchinchindi.

Nalla pilli daniki angikarinchindi, appudu avi rendu kalisi gramaniki vellayi.

English:

The white cat had an idea.

“Let’s go to the village to find food,” the white cat suggested.

The black cat accepted the idea, and both set out toward the village.

1.4 Picture: రొట్టె కనుగొనడం -→ Finding a Bread

Test

Description:

Location: గ్రామం

Village

Characters: నలుపు పిల్లి, తెలుపు పిల్లి

Black cat, white cat

Items: రొట్టె, చెట్లు, గుడిసెలు, పొదలు, రాళ్ళు

Bread, trees, huts, bushes, rocks

Action: రొట్టెని గమనిస్తున్న రెండు పిల్లులు

Two cats noticing a bread

Sentences:

అవి ఆ ఊరిలోని వీధులలో నడుస్తుండగా, వాటికి ఒక రొట్టె ముక్క కనిపించింది.

చివరకు ఆహారం దొరికినందుకు ఆ రెండు పిల్లులు చాలా సంతోషంగా ఉన్నాయి.

అయితే, అవి దానిని పంచుకోవడానికి బదులుగా వాదించుకోవడం ప్రారంభించాయి.

Translation:

Avi a uriloni vidhulalo nadusthundaga, vaatiki oka rotte mukka kanipinchindi.

Chivaraku aharam dorikinanduku a rendu pillulu chaala santoshamga unnayi.

Ayite, avi danini panchukovadaniki baduluga vadinchukovadam prarambhinchayi.

English:

As they walked through the village streets, they found a piece of bread.

Both cats were very happy to finally find food.

However, they began to argue rather than share it.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST