Story3

Title: కోతి మరియు మొసలి

Grade 0+ Lesson s1-l1

Explanation: Learn each individual topic of story in the given lessons in this section.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

3.1 Picture: మొసలి మోసపూరిత పథకం -→ Crocodile’s cunning plan

Test

Description:

Location: అడవి

Forest

Characters: మొసలి, కోతి

Crocodile, monkey

Items: చెట్లు, చెరువు, తామర పువ్వులు, పుట్టగొడుగులు, దుంగ

Trees, pond, lotus flowers, mushrooms, log

Action: కోతితో మాట్లాడుతున్న మొసలి

The crocodile talking to the monkey

Sentences:

మొసలి కోతితో మాట్లాడుతూ, “నీవిచ్చిన పండ్లు నా భార్యకు చాలా నచ్చాయి,” అని చెప్పింది.

ఆ తర్వాత అది, కోతిని తమ ఇంటికి రావాలని ఆహ్వానించింది.

కోతి ఆనందంగా ఒప్పుకొని మొసలితో వెళ్లేందుకు సిద్ధమయ్యింది.

Translation:

Mosali kothito maatladuthu, “Neevichina pandlu naa bharyaku chaala nachayi,” ani cheppindi.

Aa tarvaata athanu kothini tama intiki raavaalani aahvaaninchindi.

Kothi aanandanga oppukoni mosalitho velladaniki siddhamayyindi.

English:

The crocodile told the monkey that his wife loved the fruits given by the monkey very much.

He then invited the monkey to visit them.

The monkey was happy and agreed to go with the crocodile.

3.2 Picture: కంగారుపడిన కోతి -→ The worried monkey

Test

Description:

Location: నది ఒడ్డు

River bank

Characters: కోతి మరియు మొసలి

Monkey and Crocodile

Items: నీరు, పర్వతాలు, రాళ్ళు, మేఘాలు

Water, mountains, rocks, clouds

Action: మొసలి వీపుపై కూర్చున్న కోతి

Monkey sitting on the back of the crocodile

Sentences:

కోతి మొసలి వీపుపైన కూర్చుంది. అవి నదిలోకి లోతుగా వెళ్ళే కొద్దీ, కోతి భయపడటం ప్రారంభించింది.

"ఇంత లోపలికి ఎందుకు తీసుకువెళ్తున్నావు?" అని అది మొసలిని అడిగింది.

మొసలి వెంటనే సమాధానం చెప్పలేదు.

Translation:

Kothi mosali veepupaina koorchundi. Avi nadiloki lothuga velle koddii, kothi bhayapadatam prarambhinchindi.

"Intha lopaliki enduku tisukuvelthunnavu?" ani adi mosalini adigindi.

Mosali ventane samaadhaanam cheppaledu.

English:

The Monkey sat on the Crocodile’s back, and as they went deeper into the river, the monkey started to feel scared.

He asked the crocodile why they were going so deep.

The crocodile didn’t answer right away.

3.3 Picture: కోతి యొక్క ప్రశాంతత -→ Monkey’s Calmness

Test

Description:

Location: నది మధ్యలో

Middle of the river

Characters: కోతి మరియు మొసలి

Monkey and Mr.Crocodile

Items: చెట్లు, పర్వతాలు

Trees, mountains

Action: కోతి మొసలి వీపుపై కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తుంది.

The monkey sitting on the back of the crocodile, thinking calmly

Sentences:

తర్వాత మొసలి నవ్వుతూ, తన రహస్య పధకాన్ని గురించి కోతికి చెప్పింది.

"నా భార్య నీ గుండె కావాలని కోరింది." అని అన్నది.

అది విని కోతికి భయం వేసింది, కానీ మౌనంగా ఉండిపోయింది.

Translation:

Tarvaatha mosali navvutho thana rahasya pranaalika kothiki cheppadu.

"Naa bharya nee gunde kaavaalani korindi." ani annadi.

Adi vini kothiki bhayam vesindi, kaani mounamgaa undipoyindi.

English:

The crocodile smiled and told the monkey his secret plan.

He said his wife wanted the monkey’s heart.

The monkey was scared but stayed calm.

3.4 Picture: ఒక తెలివైన ఆలోచన -→ A Clever idea

Test

Description:

Location: నది మధ్యలో

Middle of the river

Characters: కోతి మరియు మొసలి

Monkey and Mr.Crocodile

Items: చెట్లు, పర్వతాలు, చెట్టు మీద ఉన్న గుండె

Trees, mountains, a heart on the tree

Action: కోతి చెట్టు మీద మరచిపోయిన తన గుండె గురించి మొసలికి చెబుతోంది

Monkey telling the crocodile about his heart which he forgot on the tree

Sentences:

కోతి తనను తాను రక్షించుకోవాలని త్వరగా ఆలోచించడం మొదలుపెట్టింది.

వెంటనే అది "నేను సంతోషంగా నా గుండెను నీ భార్యకి ఇచ్చేస్తాను" అని మోసలితో చెప్పింది.

"కానీ నది ఒడ్డున ఉన్న చెట్టు మీద నా గుండెను మర్చిపోయాను" అని, చెప్పింది.

Translation:

Kothi thananu thaanu rakshinchukovaalani tvaraga alochinchadam modalupettindi.

Ventane adi "Nenu santhoshamga naa gundenu nii bharyaki ichhesthaanu" ani mosalitho cheppindi.

"Kaani nadi odduna unna chettu meeda naa gundenu marchipoyaanu" ani cheppindi.

English:

The monkey thought quickly to save himself.

He told the crocodile that he would happily give his heart to the wife.

But he said he had forgotten his heart on the tree.

Characters Story: Part1 Part2 Part3 Part4 Moral

Copyright © 2020-2024 saibook.us Contact: info@saibook.org Version: 4.0 Built: 12-June-2025 12:00PM EST