Example

Title: పావురాలు & ఎలుకలు Pāvurālu& elukalu

Grade: 1-a Lesson: S1-L3

Explanation:

Examples: Lesson 2 3

"

Picture: 11

350

Location:

Characters:

Item:

Action:

* అనగనగా, ఒక గ్రామంలో ఒక వేటగాడు నివసించేవాడు, అతను ప్రతిరోజూ వేట కోసం అడవికి వెళ్ళేవాడు.

* ఒక రోజు వేటగాడు, అందమైన ఈకలు కలిగిన రాజు పావురం, మరియు దానితోపాటూ ఎగురుతున్న పావురాల గుంపును చూశాడు. వాటిలో రాజు పావురం చాలా అందంగా ఉంది.

* రాజు పావురాన్ని చూడగానే, వేటగాడు మరింత ఉత్సాహాన్ని పొందాడు.

Anaganagā, oka grāmamlō oka vēṭagāḍu nivasin̄chēvāḍu, atanu pratirōjū vēṭa kōsaṁ aḍaviki veḷḷēvāḍu.

Oka rōju vēṭagāḍu, andamaina īkalu kaligina rāju pāvuraṁ, mariyu dānitōpāṭū egurutunna pāvurāla gumpunu chūśāḍu. Vāṭilō rāju pāvuraṁ chālā andaṅgā undi.

Rāju pāvurānni chūḍagānē, vēṭagāḍu marinta utsāhānni pondāḍu.

Picture: 12

350

Location:

Characters:

Item:

Action:

* వేటగాడు భూమిపై కొన్ని గింజలను జల్లి ఒక చెట్టు దగ్గర ఉచ్చు వేశాడు.

* అతను నిశ్శబ్దంగా ఊరి బయట ఉన్న చెట్టు వెనుక దాక్కున్నాడు."

Vēṭagāḍu bhūmipai konni gin̄jalanu jalli oka cheṭṭu daggara ucchu vēśāḍu.

Atanu niśśabdaṅgā ūri bayaṭa unna cheṭṭu venuka dākkunnāḍu.

Picture: 13

350

Location:

Characters:

Item:

Action:

* ఆ పావురాలు ఆకాశంలో ఎగురుతూ ఉండగా, నేలపై కొన్ని గింజలను చూశాయి.

* ఒక పావురం ఆ గింజలను చూసి మిగతా వాటికి చెప్పింది.

* దగ్గరలో ఎవరూ కనిపించకపోవడంతో ఆ పావురాలు కిందికి దిగి ఆ ధాన్యాన్ని తినాలని నిర్ణయించుకున్నాయి.

Ā pāvurālu ākāśamlō egurutū uṇḍagā, nēlapai konni gin̄jalanu chūśāyi.

Oka pāvuraṁ ā gin̄jalanu chūsi migatā vāṭiki cheppindi.

Daggaralō evarū kanipin̄chakapōvaḍantō ā pāvurālu kindiki digi ā dhānyānni tinālani nirṇayin̄chukunnāyi.

Picture: 14

350

Location:

Characters:

Item:

Action:

* రాజు పావురం మరియు దాని గుంపులోని పావురాలు, దొరికిన గింజలను పంచుకోవడానికి చెట్టు దగ్గర నేలపైన వాలాయి.

Rāju pāvuraṁ mariyu dāni gumpulōni pāvurālu, dorikina gin̄jalanu pan̄chukōvaḍāniki cheṭṭu daggara nēlapaina vālāyi.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 20-November-2023 7:30PM EST