Example

Title: లేజీ గాడిద Lējī gāḍida

Grade: 4-a Lesson: S1-L5

Explanation: A storytelling adventure that is kid-friendly and filled with captivating details, inviting the listener to visualize the tale through their imagination.

Story:

Picture: 11

350

Location: వ్యాపారి ఇల్లు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: ఇల్లు, చెట్లు మరియు ఉప్పు బస్తాలు.

Action: వ్యాపారి వద్ద ఒక గాడిద ఉంది.

* ఒకప్పుడు, ఒక శ్రద్ధగల ఉప్పు వ్యాపారి నివసించేవాడు.

* అతని వద్ద ఒక గాడిద ఉంది, అది తన బద్దకం వలన, సోమరి గాడిదగా పేరు తెచ్చుకుంది.

* ఈ గాడిద, ఆ ఉప్పు వ్యాపారికి తన రోజువారీ పనుల్లో ఎప్పుడు తోడుగా ఉండేది.

Okappuḍu, oka śrad’dhagala uppu vyāpāri nivasin̄chēvāḍu.

Atani vadda oka gāḍida undi, adi tana baddakaṁ valana, sōmari gāḍidagā pēru tecchukundi.

Ī gāḍida, ā uppu vyāpāriki tana rōjuvārī panullō eppuḍu tōḍugā uṇḍēdi.

Picture: 12

350

Location: గ్రామం (మార్కెట్‌కు వెళ్ళే దారి).

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: చెట్లు, ఇళ్ళు, పక్షులు.

Action: వ్యాపారి గాడిదను తీసుకొని వెళ్తున్నాడు.

* ప్రతి రోజు, వ్యాపారి రద్దీగా ఉన్న బజారుకు వెళ్ళటానికి ముందు తన నమ్మకమైన గాడిద వీపుపై ఉప్పు బస్తాలను జాగ్రత్తగా ఎక్కించేవాడు.

* అక్కడ, అతను తన ఉప్పును అమ్మేవాడు.

* తన జీవనోపాధి కోసం ఈ పనిని వ్యాపారి రోజు అంకితభావంతో చేసేవాడు.

Prati rōju, vyāpāri raddīgā unna bajāruku veḷḷaṭāniki mundu tana nam’makamaina gāḍida vīpupai uppu bastālanu jāgrattagā ekkin̄chēvāḍu.

Akkaḍa, atanu tana uppunu am’mēvāḍu.

Tana jīvanōpādhi kōsaṁ ī panini vyāpāri rōju aṅkitabhāvantō chēsēvāḍu.

Picture: 13

350

Location: నది ఒడ్డు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు.

Action: వ్యాపారి నీళ్ళు. త్రాగుతున్నాడు, మరియు గాడిద విశ్రాంతి తీసుకుంటుంది.

* బజారుకు వెళ్లే సమయంలో వారు, నదిని దాటవలసి వచ్చింది.

* వారు దారిలో అలసిపోయి, దాహం తీర్చుకోవడానికి నది ఒడ్డున కొంత సమయం గడిపేవారు.

* ఈ కొంత సమయంలో వారు విశ్రాంతి తీసుకొని, తిరిగి ప్రయాణించడానికి సిద్ధమయ్యేవారు.

Bajāruku veḷlē samayanlō vāru, nadini dāṭavalasi vacchindi.

Vāru dārilō alasipōyi, dāhaṁ tīrchukōvaḍāniki nadi oḍḍuna konta samayaṁ gaḍipēvāru.

Ī konta samayanlō vāru viśrānti tīsukoni, tirigi prayāṇin̄chaḍāniki sid’dhamayyēvāru.

Picture: 14

350

Location: నది ఒడ్డు.

Characters: ఉప్పు వ్యాపారి, గాడిద.

Item: నది, పర్వతాలు, పక్షులు మరియు ఉప్పు బస్తాలు.

Action: గాడిద నీళ్లలో పడింది.

* వేడిగా ఉన్న ఒక రోజు గాడిద, వ్యాపారి వెంట నడుస్తుండగా, అది అకస్మాత్తుగా ఒక రాయిపైనుండి జారి నదిలో పడింది.

* గాడిద పైకి రావటానికి ప్రయత్నిస్తూ ఉంది.ఇది గమనించిన వ్యాపారి సహాయం కోసం, గాడిద వద్దకు పరుగెత్తాడు.

* అతను గాడిద వద్దకు చేరుకుని, దానిని సురక్షితంగా నదీతీరానికి చేర్చాడు.

Vēḍigā unna oka rōju gāḍida, vyāpāri veṇṭa naḍustuṇḍagā, adi akasmāttugā oka rāyipainuṇḍi jāri nadilō paḍindi.

Gāḍida paiki rāvaṭāniki prayatnistū undi.Idi gamanin̄china vyāpāri sahāyaṁ kōsaṁ, gāḍida vaddaku parugettāḍu.

Atanu gāḍida vaddaku chērukuni, dānini surakṣitaṅgā nadītīrāniki chērchāḍu.


Copyright © 2020-2022 saibook.us Contact: info@saibook.us Version: 1.5 Built: 22-April-2024 7:30PM EST